చదువులా డిస్కౌంట్ వ్యాపారాలా : స్కూల్ అడ్మిషన్లకి లక్కీడ్రా

చదువులా డిస్కౌంట్ వ్యాపారాలా : స్కూల్ అడ్మిషన్లకి లక్కీడ్రా

flash news2018-03-08 12:54:33
Share Tweet Google+ Instagram

విద్య వ్యాపారం అయిపోయింది. ఎప్పటి నుంచో ఉన్న మాటేకానీ.. ఇప్పుడు అది మరీ బరితెగించింది. మా స్కూల్ లో క్వాలిటీ టీచర్స్ ఉన్నారు.. నాణ్యమైన విద్య అందిస్తాం.. మీ పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దుతాం అని ఒకప్పుడు చెప్పుకునే పాఠశాలలు.. ఇప్పుడు రూటు మార్చాయి. పక్కా వ్యాపారం చేస్తున్నాయి. నిన్నటి వరకు చదువు వ్యాపారం మాత్రమే అని అనుకున్నాం.. ఇప్పుడు అది వికృతరూపంగా మారాయి. ప్రైవేట్ స్కూల్స్ దోపిడీని బహిరంగంగానే ప్రకటించేశాయి. అడ్మిషన్లకు డిస్కొంట్ ఇవ్వటమే కాకుండా.. లక్కీ డ్రా ప్రకటించేశారు. అడ్మిషన్ నెంబర్లను లక్కీ డ్రా తీసి బహుమతులు ఇస్తామని హైదరాబాద్ హయత్ నగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాల ఏకంగా బోర్డులు పెట్టేయటం, ప్రచారం చేయటంతో పేరంట్స్ నోరెళ్లబెడుతున్నారు.

ప్లే స్కూల్ నుంచి ఐదో తరగతి వరకు, అదే విధంగా ఐదు నుంచి 10వ తరగతి వరకు వివిధ కేటగిరీల కింద బహుమతులు అనౌన్స్ చేసింది ప్రైవేట్ స్కూల్. ఫస్ట్ ప్రైజ్ 2 స్పోర్ట్స్ సైకిల్, సెకండ్ ప్రైజ్ కింద రిమోట్ హెలికాఫ్టర్లు, మూడో ప్రైజ్ కింద స్పోర్ట్స్ కిట్స్ ఇస్తామని వెల్లడించింది. ఆరు బహుమతులను వెల్లడించింది. లక్కీ డ్రాకి అర్హులు కావాలంటే కండీషన్ కూడా ఉంది. మార్చి 22వ తేదీలోగా అడ్మిషన్స్ తీసుకోవాలి. ఇప్పటికే చదువుతున్న పిల్లలు రెన్యువల్ చేసుకోవాలనే నిబంధన పెట్టింది.

నోటీస్ బోర్డులో పెట్టిన ఈ లక్కీ డ్రా ప్రకటనపై పేరంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువులు చెబుతున్నారా.. వ్యాపారాలు చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖ కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Leave a reply