నేతన్నల రుణాలన్నీ మాఫీ చేస్తాం : కేటీఆర్

నేతన్నల రుణాలన్నీ మాఫీ చేస్తాం : కేటీఆర్

flash news2018-03-10 13:12:30
Share Tweet Google+ Instagram

నేతన్నల వ్యక్తిగత రుణాలను మాఫీ చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. చేనేత, పవర్ లూమ్స్ కు వేర్వేరుగా ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. చేనేతకు 1200 కోట్లు కేటాయించిన ఘనత టీఆర్ఎస్ దే అన్నారు. శుక్రవారం (మార్చి-9) సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చేనేత సహకార సంఘాన్ని పరిశీలించిన మంత్రి.. నేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 

చేనేతకు ప్రత్యేక కార్పొరేషన్ పెట్టలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు చెప్పారు మంత్రి కేటీఆర్. పవర్ లూమ్ కు కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఉంటుందన్న ఆయన..చేనేత మరనేత వారు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు వేసుకోవాలనే నినాదంతో మంచి లాభాలు వస్తాయన్నారు మంత్రి కేటీఆర్.

Related Articles

Leave a reply