మహారాష్ట్రలో రుణమాఫీ కోసం.. 30 వేల మంది రైతుల పాదయాత్ర

మహారాష్ట్రలో రుణమాఫీ కోసం.. 30 వేల మంది రైతుల పాదయాత్ర

politics2018-03-10 12:58:27
Share Tweet Google+ Instagram

MP FORMERS

 

 

 

పంట రుణాల మాఫీ వ్యవహారంలో.. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది రైతులు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. మార్చి-11 నాటికి మహారాష్ట్ర అసెంబ్లీని ముట్టడించాలన్న లక్ష్యంతో జరుగుతున్న ఈ యాత్రలో.. 30 వేల మంది రైతులు.. నాసిక్ నుంచి ముంబై వైపు కదులుతున్నారు. ఆల్ ఇండియా కిసాన్ సభ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ర్యాలీ.. ఇవాళ వసింద్ పట్టణానికి చేరుకుంది. వడ్డీల భారం పెరిగి.. తమ రుణాలు పెరిగాయని.. ఇందుకు అధికారుల తీరే కారణమని రైతులు విమర్శించారు. వ్యవసాయం భారంగా మారిందన్నారు. ప్రభుత్వమే సమస్యను పరిష్కరించాలని.. రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

Related Articles

Leave a reply