స్వేచ్ఛా, అధికారమే థర్డ్ ఫ్రంట్ ఎజెండా: సీఎం కేసీఆర్

స్వేచ్ఛా, అధికారమే థర్డ్ ఫ్రంట్ ఎజెండా: సీఎం కేసీఆర్

telangana2018-03-10 12:42:16
Share Tweet Google+ Instagram


అనేక రాష్ట్రాలు, విభిన్న వర్గాలున్న భారతదేశానికి.. ప్రత్యేక అభివృద్ధి ఎజెండా రూపొందాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడున్న విధానాలు, పద్దతులు, చట్టాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి, అవసరమైన మార్పులు, సంస్కరణలు తెచ్చే విషయంపై.. అన్ని రంగాల ప్రముఖులు, సీనియర్ అధికారులు మార్గనిర్దేశం చేయాలన్నారు. ఈ ప్రయత్నంలో దేశంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల వారు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లవుతున్నా.. అనుకున్న పురోగతి సాధించలేదన్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ప్రగతిపథంలో దూసుకుపోతున్నా.. మన దేశంలోని ప్రజల ప్రాథమిక అవసరాలు కూడా తీరటంలేదన్నారు. ప్రస్తుతం దేశాభివృద్ధికి కావాల్సిన అభివృద్ధి ఎజెండా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడున్న విధానాలు, పద్ధతుల మంచి చెడులపై.. ప్రగతి భవన్ లో వివిధ రంగాల ప్రముఖులు, సీనియర్ అధికారులతో చర్చించారు కేసీఆర్. ప్రస్తుత విధానాలు, చట్టాలను అధ్యయనం చేసి.. అవసరమైన మార్పులు, సంస్కరణలు తెచ్చే విషయంలో.. అన్ని రంగాల నిపుణులు, సీనియర్ అధికారులు మార్గనిర్దేశం చేయాలన్నారు. ఈ ప్రయత్నంలో అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల వారు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఇప్పటికీ దేశ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కూడా జరగటం లేదన్నారు కేసీఆర్. చాలా రాష్ట్రాల మధ్య జల వివాదాలున్నా, అవి పరిష్కారం కావటం లేదన్నారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో.. అనేక కమిషన్లు, నిపుణులు సూచించిన సంస్కరణలు.. అమలు కావటంలేదని చెప్పారు. ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తి పూర్తిస్థాయిలో కనిపించటం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో దేశాభివృద్ధికి కావాల్సిన ఎజెండాను తయారు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. సంక్షేమం, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో.. తెలంగాణ రాష్ట్రం అనేక మైలురాళ్లను అధిగమించిందని చెప్పారు సీఎం.

Related Articles

Leave a reply