కేసీఆర్‌కు మద్దతిస్తే తప్పేంటి?

కేసీఆర్‌కు మద్దతిస్తే తప్పేంటి?

politics2018-03-08 14:57:42
Share Tweet Google+ Instagram

టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతిస్తే తప్పేంటని జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. దేశంలోని ఉత్తర, దక్షిణ రాష్ర్టాల మధ్య అంతరం రోజురోజుకూ పెరిగిపోతున్నదని, ఇది దేశ సమగ్రతకు ముప్పేనని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 14న తమ పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం మాదాపూర్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంతో స్నేహభావంతో ఉండాలని అంటున్నారని, థర్డ్‌ఫ్రంట్ విషయంలో పక్కనే ఉన్న రాష్ట్రంతో స్నేహంగా ఉంటే తప్పేంటని అన్నారు. ఎక్కడో ఢిల్లీలో ఉన్న బీజేపీకి మద్దతు ఇస్తున్నప్పుడు పక్కనే ఉన్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు మద్దతిస్తే తప్పేంటి అని పవన్ ప్రశ్నించారు. 2019లో జరిగే ఎన్నికలకు స్పష్టమైన విధానంతో ప్రజల ముందుకువస్తున్నామని, తమ పార్టీ ఎప్పటికీ ప్రజలపక్షానే ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా విషయంలో ప్రధాని మోదీ స్పష్టత ఇవ్వాలని పవన్ కోరారు.

Related Articles

Leave a reply