టీఆర్‌ఎస్ నేత దారుణ హత్య

టీఆర్‌ఎస్ నేత దారుణ హత్య

flash news2018-03-08 14:54:20
Share Tweet Google+ Instagram

టీఆర్‌ఎస్ నేత, రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తపల్లి గ్రామ ఎంపీటీసీ చంద్రకళ భర్త బీనవేని దేవయ్య(42) దారుణ హత్య బుధవారం జిల్లాలో సంచలనం సృష్టించింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తార్క శ్రీనివాస్ తన కూతురు పుట్టు వెంట్రుకల శుభకార్యానికి దేవయ్యను ఆహ్వానించాడు. సాయం త్రం 4గంటల ప్రాంతంలో మొదటి అంతస్తులో సామూహిక భోజనం చేస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన వంగ సందీప్‌రెడ్డి అనే యువకుడు దేవయ్యను పలకరిస్తూనే అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. భీతావహుడైన దేవయ్య రక్షించండి.. అంటూ మెట్లు దిగుతుండగా వెంటాడి మరోసారి ఛాతిలో పొడవగా, దేవయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ హఠాత్పరిణామానికి అక్కడే ఉన్న గ్రామస్థులు నిశ్చేష్ఠులయ్యారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటరమణ, సీఐలు రవీందర్, శ్రీనివాసరావులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన తీరు తెలుసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మృతునికి భార్య చంద్రకళ, కుమారులు అన్వేష్, ప్రపుల్ ఉన్నారు. విషయం తెలుసుకున్న వివిధ మండలాల టీఆర్‌ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు భారీగా అక్కడకు చేరుకున్నారు.

Related Articles

Leave a reply