రిజర్వేషన్ ఉద్యమం : పార్లమెంట్ లో బైఠాయించిన టీఆర్ఎస్ ఎంపీలు

రిజర్వేషన్ ఉద్యమం : పార్లమెంట్ లో బైఠాయించిన టీఆర్ఎస్ ఎంపీలు

flash news2018-03-08 12:55:37
Share Tweet Google+ Instagram

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన పంపిన రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకి దిగారు టీఆర్ఎస్ ఎంపీలు. మూడో రోజు బుధవారం ఆందోళన కొనసాగించారు. లోక్‌సభ లోపల, బయట నిరసన తెలిపారు. ముస్లింలు, ఎస్టీలకు విద్యా సంస్థల్లోనే కాకుండా ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్.  ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ ను 50 నుంచి 62 శాతానికి పెంచుతూ అసెంబ్లీ 2017 ఏప్రిల్‌లోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసును రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ఇందుకు కేంద్రం ససేమిరా అంటోంది. సుప్రీంకోర్టులో పరిధిలో ఉందని చెబుతోంది. 50శాతం రిజర్వేషన్స్ మించరాదని ఆదేశాలు ఉన్నాయని అంటోంది. పార్లమెంట్ పరిధిలోని అంశాన్ని సుప్రీంకోర్టుతో ముడిపెట్టటం మంచింది కాదని టీఆర్ఎస్ ఎంపీలు అంటున్నారు. కేంద్రం తలచుకుంటే వెంటనే చేసేయొచ్చని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. అందుకే తీర్మానాన్ని పక్కన పెట్టేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ.. పార్లమెంట్ ఆవరణలోని మెట్లపై కూర్చుని ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఆర్టికల్ 16(4) ప్రకారం రిజర్వేషన్ అంశం అనేది రాష్ట్ర జనాభా ఆధారంగా ఉంటుందన్న విషయాన్ని చూపిస్తూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు టీఆర్ఎస్ ఎంపీలు.

Related Articles

Leave a reply