లైసెన్స్ మేళా: మహిళలకు ప్రత్యేకం

లైసెన్స్ మేళా: మహిళలకు ప్రత్యేకం

telangana2018-03-08 12:52:36
Share Tweet Google+ Instagram

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ( గురువారం, మార్చి-8) రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం ప్రత్యేకంగా లైసెన్స్ మేళా నిర్వహిస్తోంది రవాణ శాఖ.వాహనాలు నడిపే మహిళలు,యువతుల సంఖ్య పెరుగుతుండటంతో అందరూ డ్రైవింగ్  లైసెన్స్ లు తీసుకునేలా ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యింది. ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం కూడా కావడంతో వారికోసమే ప్రత్యేకంగా లైసెన్స్ మేళా ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని RTO ఆఫీసుల్లో డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహిస్తున్నారు.

 

ముఖ్యంగా హైదరాబాద్  గ్రేటర్ లోని  అన్ని ట్రాన్స్ పోర్టు ఆఫీసుల్లో  ఇవాళ  ఒక్క రోజు  మహిళలకే  లెర్నింగ్  లైసెన్స్ లు (LLR) లు ఇవ్వనున్నట్లు జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ జే. పాండురంగనాయక్ తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. LLR తీసుకునే వాళ్లు ఏజ్ సర్టిఫికెట్(10 తరగతి),ఆధార్ కార్డు,ఓటర్ ఐడీ కార్డు తో రావాలని సూచించారు. LLR పొందిన ఆరు నెలల తర్వాత పర్మినెంట్ లైసెన్స్ జారీ చేస్తారు. గ్రేటర్ పరిధిలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్ పేట, బండ్లగూడ, మెహిదీపట్నం, అత్తాపూర్, ఉప్పల్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

అయితే రవాణా శాఖకు సంబంధించి మహిళా ఉద్యోగులకు సెలవు కొనసాగుతుందని… స్వచ్ఛందంగా సేవలందించేందుకు వస్తే అభ్యంతరం లేదని తెలిపారు.

Related Articles

Leave a reply