కేసీఆర్‌కు జై కొట్టిన మరో మాజీ సిఎం.. కూటమిలో చేరతానంటూ ఫోన్

కేసీఆర్‌కు జై కొట్టిన మరో మాజీ సిఎం.. కూటమిలో చేరతానంటూ ఫోన్

politics2018-03-07 10:14:43
Share Tweet Google+ Instagram


బిజెపి, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చేందుకు కొత్త కూటమి పెడతానన్న కేసీఆర్ ప్రకటనకు అనూహ్య మద్దతు లభిస్తోంది. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, జేసీసీ అధినేత అజిత్ జోగి ఫోన్ చేశారు. కేసీఆర్ కూటమిలో చేరతానని ప్రకటించారు. ఫోన్ చేసి కేసీఆర్‌ను అభినందించిన జోగి కలిసి పోరాడదామన్నారు. మిగతా పార్టీల నేతలనూ కూడగట్టి కూటమిని బలోపేతం చేద్దామన్నారు. జోగికి సిఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్‌కు ఇప్పటికే తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు. మిగతా రాష్ట్రాల నుంచి కూడా కేసీఆర్‌కు వందలాది ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. అంతా తమ మద్దతును ప్రకటిస్తూ కొత్త కూటమికి స్వాగతం పలుకుతున్నారు.

Related Articles

Leave a reply