మళ్లీ నకిలీ వి‘పత్తి’

మళ్లీ నకిలీ వి‘పత్తి’

health2018-03-06 11:28:55
Share Tweet Google+ Instagram

 రాష్ట్రాన్ని నకిలీ పత్తి విత్తనాలు ముంచెత్తుతున్నాయి. గ్రామగ్రామాన వరదై పారుతున్నాయి. మాయమాటలతో దళారులు రైతులకు నకిలీలను అంటగడుతున్నారు. ఒక్క ఆదిలాబాద్‌ జిల్లాలోనే 8 ప్రాం తాల్లో నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు బయటపడటం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్యాకెట్‌పై కంపెనీ పేరు కూడా లేకుండా పంపిణీ చేస్తుండటంతో బీటీ–2 ఏవో, బీటీ–3 ఏవో కూడా అధికారులకు అంతుబట్టడం లేదు.  

గుజరాత్, ఏపీల నుంచే
గుజరాత్, ఏపీల  నుంచే భారీగా నకిలీ విత్తనాలు రాష్ట్రానికి వస్తున్నాయని అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో 20 ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసుకొని నకిలీ విత్తన ప్యాకెట్ల తయారు చేస్తున్నారని తేలింది. దీనిపై స్థానిక అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో నకిలీ విత్తనాలు రైతు ముంగిట్లోకి వచ్చేశాయి.

ఏరిన పత్తి నుంచి దూదిని వేరు చేసే సమయంలో పత్తి గింజలను ముఠాదారులు సేకరిస్తుంటారు. వాటికి రంగులద్ది ప్యాకెట్లలో నింపి బీటీ–2 విత్తనాలుగా విక్రయిస్తుంటారు. ఒక్కో ప్యాకె ట్‌కు రూ.100 నుంచి రూ.150 ఖర్చు అవుతుంటే రైతులకు రూ.800 నుంచి రూ. 900కు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఒక్కో ప్యాకెట్‌పై స్థానిక వ్యవసాయాధికారులకు రూ.50 వరకు ముడుతున్నట్లు ఆరోపణలున్నాయి. పోలీసుల కూ రూ.25 వరకు ఇస్తున్నట్లు సమాచారం.  

Related Articles

Leave a reply