కేసీఆర్‌ వాదనను స్వాగతిస్తున్నాం: తమ్మినేని

కేసీఆర్‌ వాదనను స్వాగతిస్తున్నాం: తమ్మినేని

politics2018-03-06 10:42:57
Share Tweet Google+ Instagram

 రాష్ట్రాలకు అధికారాలు అప్పజెప్పాలని, దేశానికి నిజమైన సమాఖ్య వ్యవస్థ రావాలన్న కేసీఆర్‌ వాదనను స్వాగతిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడలో కోటగిరి రంగారావు మీటింగ్‌హాల్‌ను సోమవారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాష్ట్రాలకు అధికారాలు బదలాయించాలని ఎప్పటి నుంచో సీపీఎం డిమాండ్‌ చేస్తోందన్నారు. మోదీ ప్రభుత్వాన్ని సమర్థించిన కేసీఆర్‌ లాంటి వాళ్లు ఇప్పటికైనా కళ్లుతెరిచినందుకు సంతోషిస్తున్నామన్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడం, గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయకపోవడం కేంద్రం వైఖరిని స్పష్టం చేస్తోందన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు బీజేపీకి అనుకూలంగా ఉన్న టీఆర్‌ఎస్‌ ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మారబోదన్నారు. కేంద్రంలో సైతం వామపక్ష కూటమికి చెందిన ఎన్డీఎల్‌ఎఫ్‌ మాత్రమే ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందన్నారు.

Related Articles

Leave a reply