మాది భగత్ సింగ్ పోరాటం: మంత్రి హరీశ్

మాది భగత్ సింగ్ పోరాటం: మంత్రి హరీశ్

flash news2018-03-13 12:19:44
Share Tweet Google+ Instagram

రాష్ట్రానికి చెడు పేరు తెచ్చేలా అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి హరీశ్. కాంగ్రెస్ నేతలు అసహనంతో ఉన్నారని… గవర్నర్ ను టార్గెట్ గా చేసుకుని దాడి చేయడం దారుణమన్నారు. ఎన్నిరోజులైనా సభను నిర్వహించడానికి రెడీగా ఉన్నామని చెప్పామన్నారు. అసెంబ్లీలో దాడి చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఎలా సమర్ధిస్తారని ప్రశ్నించారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అన్ని అన్నారు. సభలో ఉండటం ఇష్టం లేక గుండాల్లా ప్రవర్తించారన్నారు.  తెలంగాణ కోసం తాము పోరాటం చేశామని…అయితే తాము చేసిన చేసింది భగత్ సింగ్ పోరాటమని… కాంగ్రెస్ వాళ్లు చేసింది ఉద్రవాదుల పోరాటమన్నారు. ఇందులో దేశ భక్తికి..దేశ ద్రోహానికి ఉన్న తేడా ఉందన్నారు మంత్రి హరీశ్.

Related Articles

Leave a reply