సీఎం కేసీఆర్ సీరియస్ : సభలో అరాచకాన్ని సహించం

సీఎం కేసీఆర్ సీరియస్ : సభలో అరాచకాన్ని సహించం

telangana2018-03-13 12:17:07
Share Tweet Google+ Instagram

స్వామిగౌడ్ పై కాంగ్రెస్ దాడి బాధాకరం, దురదృష్టకరమన్నారు సీఎం కేసీఆర్. మంగళవారం (మార్చి-13) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినప్పట్నుంచే కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్గం చేయడం  నుంచి కాంగ్రెస్ లో ఈ అరాచకాలు మొదలయ్యాయన్నారు.

 

ప్రజలు కాంగ్రెస్ ను తిప్పికొటుతున్నారని.. దాన్ని ఓర్వలేకనే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఆరు నూరైనా తాను 100 శాతం ప్రజలకు జవాబుదారీ తనంతో ఉన్నానని వెల్లడించారు. తమ ప్రభుత్వ వైఖరిని చూసి ఓర్వలేకనే ఈ దుర్బిద్ది అన్నారు. అరాచకాలు చేస్తుంటే తమ ప్రభుత్వం చూస్తూ కూర్చోదని చెప్పారు. కాంగ్రెస్ దాడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అరాచక శక్తులను భరించే శక్తి తమకు లేదన్నారు. కౌన్సిల్ చైర్మన్ పై దాడి చేయడమేకాక, నాటకం ఆడుతున్నారని చెప్పడం కాంగ్రెస్ వైఖరి నగ్నంగా బయటపడిందన్నారు. ఐక్యంగా నిర్ణయం తీసుకున్నామని, రాజ్యాంగబద్దంగా గవర్నర్ సభను ప్రారంభిస్తుండగా ఈ ఘటన జరగడం రాజ్యంగానికే అవమానకరమన్నారు. సభా హక్కులకు భంగం కలిగించొద్దని సీఎం సూచించారు.

ఈ సభలో కూర్చుంటే వచ్చది ఏమీ లేదన్నారు. ఎలాగైన బయటకు వెళ్లాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ సభ్యులు.. గవర్నర్ ప్రసంగం సమయంలో దాడి చేశారన్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్లు తమకు సమాచారం ఉందన్నారు సీఎం. రాజకీయాల్లో ఇంత అసహనం పనికి రాదన్నారు. శాసనసభను హుందాగా నడిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి సభ్యునిపై ఉందన్నారు. మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ.. మైకులతో దాడి చేయడం సరికాదన్న ఆయన.. ఈ విషయంపై ఎట్టి పరిస్థితిలోనూ రాజీపడేది లేదన్నారు సీఎం కేసీఆర్. సభలో అరాచకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం అని.. చూస్తూ ఊరుకోం అంటూ స్పష్టం చేశారు.

Related Articles

Leave a reply