హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా అంజనీకుమార్‌

హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా అంజనీకుమార్‌

flash news2018-03-12 17:35:44
Share Tweet Pin it

హైదరా బాద్‌, సైబరాబాద్‌ కమిషరేట్ల పరిధిలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. అందరూ ఊహించినట్టు శాంతి భద్రతల అడిషనల్‌ డీజీగా పనిచేస్తున్న అంజనీకుమార్‌ను హైదరాబాద్‌ కమిషనర్‌గా నియమించారు. సైబరాబాద్‌ కమిషనర్‌గా వీసీ సజ్జనార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు తాత్కాలిక సీపీగా ఉన్న వీవీ శ్రీనివాసరావును రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. సైబరాబాద్‌ కమిషనర్‌గా వ్యవహరించిన సందీప్‌ శాండిల్యకు పదోన్నతి కల్పించి రైల్వే, రోడ్‌సేఫ్టీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా నియమించారు. నగరంలో భారీగా ప్రక్షాళన చేపట్టింది. దీర్ఘకాలికంగా ఉన్న అడిషనల్‌ సీపీలు, డీసీపీలు బదిలీ అయ్యారు. మహిళా భద్రతకు పెద్దపీట వేశారు. ఆ విభాగానికి పూర్తిస్థాయి ఐజీ(హైదరాబాద్‌) స్వాతి లక్రాకు అధికారాలు కట్టబెట్టారు. ఆమె నిర్వర్తిస్తున్న శాంతిభద్రతల అడిషనల్‌ సీపీగా షికా గోయల్‌ను నియమించారు. ఇక నగర ట్రాఫిక్‌ విభాగం అడిషనల్‌ సీపీగా అనిల్‌కుమార్‌ను నియమించారు. లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ సీపీగా దేవేందర్‌సింగ్‌ చౌహానను నియమించారు. పశ్చిమ మండలం డీసీపీగా ఉన్న వెంకటేశ్వరరావును మాదాపూర్‌ డీసీపీ బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఏఆర్‌ శ్రీనివాస్ ను నియమించారు. మధ్య మండలం డీసీపీ డి. జోయల్‌ డేవిస్‌ను సిద్దిపేట కమిషనర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో డీసీపీగా పి. విశ్వప్రసాద్‌ను నియమించారు. ఉత్తర మండలం డీసీపీ గా ఎం రమేష్‌ బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న శశిధర్‌రాజును ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా కోరారు. రాచకొండ జాయింట్‌ పోలీసు కమిషనర్‌గా జి.సుధీర్‌బాబును నియమించారు. ఇక్కడ పనిచేస్తున్న తరుణజోషీకి డీఐజీగా పదోన్నతి కల్పించారు. డాక్టర్‌ చేతన మైలబత్తుల సుల్తాన్ బజార్‌ డివిజన్ అసిస్టెంట్‌ కమిషనర్‌గా నియమించారు. ఇక్కడ పనిచేస్తున్న జి.చక్రవర్తిని గతంలోనే బదిలీ చేశారు.

Related Articles

Leave a reply