దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలి : పల్లా

దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలి : పల్లా

telangana2018-03-12 16:25:26
Share Tweet Google+ Instagram

అసెంబ్లీలో సోమవారం (మార్చి-12) స్వామిగౌడ్ పై కాంగ్రెస్ నేతలు చేసిన దాడిపై సీరియస్ అయ్యారు టీఆర్ఎస్ నేతలు. ప్రజాస్వామ్యంలో ఇప్పటివరకూ జరగని సంఘటన ఇవాళ అసెంబ్లీలో జరగడం దారుణమన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేసుకునే ఎటాక్ చేశారన్నారు.  టీఆర్ఎస్ పై ఓర్వలేకనే దాడులు చేస్తున్నారన్నారు.  కాంగ్రెస్ నేతలు తాగి సభకు రావడమేకాక, గవర్నర్ ను తిట్టి, స్వామిగౌడ్ పై దాడికి దిగారన్నారు.

 

దీనిపై కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు కోమటిరెడ్డిని సస్పెండ్ చేయాలని కోరారు.  బలహీన వర్గానికి చెందిన స్వామిగౌడ్ పై దాడిచేయడం దుర్మార్గమన్నారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని కోరారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.  సభలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై సీరియస్ అయ్యారు టీఆర్ఎస్ నేతలు.  దేశానికి రోలల్ మోడల్ గా దూసుకుపోతున్న తెలంగాణ అసెంబ్లీలో ఇలా జరగడం దారుణమన్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.  అనేక పథకాలతో రాష్ట్రం ముందుకు వెళ్తుంటే కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందన్నారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరన్నారు. సభలో కోమటిరెడ్డి విసిరిన ఫోన్ స్వామిగౌడ్ కు తగలడంతో..చికిత్స కోసం ఆయనను సరోజినీ హస్పిటల్ కి తరలించినట్లు చెప్పారు.

Related Articles

Leave a reply