కాంగ్రెస్ దాడిని ఖండిస్తున్నాం : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

కాంగ్రెస్ దాడిని ఖండిస్తున్నాం : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

politics2018-03-12 16:24:22
Share Tweet Google+ Instagram

అసెంబ్లీలో కాంగ్రెస్ శాసన సభ్యులు చేసిన దాడిని ముక్తకంఠంతో ఖండించారు టీఆర్ఎస్ శాసన సభ్యులు. గౌరవ ప్రజాప్రతినిధులు అలా దాడి  చేయడం పద్దతి కాదన్నారు కొండా సురేఖ. గవర్నర్ ప్రసంగం ఎప్పుడు అయిన ప్రభుత్వం రాసి ఇస్తుంది…ఆ ప్రసంగం వినడవ ఇబ్బంది ఉంటే రేపటి నుండి చర్చకు రావాలి కానీ దాడి చేయడం పద్దతి కాదన్నారు ఆమె. కావాలని చైర్మన్ పై దాడి చేశారు… ఈదాడిని అన్ని పార్టీలు ఖండించాలని ఆమె కోరారు. ఈ రోజు బ్లాక్ డే అని ఆమె అభివర్ణించారు. బస్ యాత్ర తుస్ యాత్ర అందుకే ఈ ఫ్రాస్టేషన్ తో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో దాడి చేసిందన్నారు జీవన్ రెడ్డి. ఈ దాడిని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి  పథకాలను గవర్నర్ చెప్పకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారని ఆరోపించారు వొడితెల సతీష్ బాబు.

Related Articles

Leave a reply