కాంగ్రెస్‌ ఒక సర్కస్‌ కంపెనీ

కాంగ్రెస్‌ ఒక సర్కస్‌ కంపెనీ

telangana2018-03-10 13:22:25
Share Tweet Pin it

కాంగ్రెస్‌ సర్కస్‌ టీమ్‌ తెలంగాణలో ప్రదర్శనలు చేసిందని, ఆ పార్టీ ఎన్ని ఫీట్లు చేసినా ప్రజలు పట్టించుకోలేదని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలసి శుక్రవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

బస్సుయాత్ర చేసిన కాంగ్రెస్‌ నేతలకు వచ్చే ఎన్నికల్లోనూ పుట్టగతులుండవని హెచ్చరించారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా టీఆర్‌ఎస్‌ నేతలపై, మంత్రులపై కాంగ్రెస్‌ నోరు పారేసుకుంటోందని మండిపడ్డారు. మంత్రి ఈటల రాజేందర్‌పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.  

Related Articles

Leave a reply