గెలిచిన గోల్డ్ మెడల్‌తో తండ్రి అప్పులు తీర్చేసింది

గెలిచిన గోల్డ్ మెడల్‌తో తండ్రి అప్పులు తీర్చేసింది

viral videos2018-03-05 10:44:30
Share Tweet Google+ Instagram

సీనియర్ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన నవజ్యోత్‌ కౌర్ తన గోల్డ్ మెడల్‌తో కుటుంబ భారాన్ని తగ్గించింది. గత దశాబ్ధకాలంతో ఆమె తండ్రి సుక్‌చైన్ సింగ్ ఆమె ట్రైనింగ్ కోసం చేసిన అప్పులను కౌర్ ఈ మెడల్‌తో వచ్చిన డబ్బులతో తీర్చేసింది. కౌర్ ట్రైనింగ్ కోసం ఆమె తండ్రి 13 లక్షల రూపాయలు అప్పు చేశాడు. ఆమె ట్రైనింగ్ కోసం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందలేదని, దీంతో తప్పని పరిస్థితుల్లో అప్పు చేశానని ఆమె తండ్రి సుక్‌చైన్ తెలిపారు. ఇప్పుడు తమ కష్టానికి ప్రతిఫలంగా కౌర్ గోల్డ్ మెడల్ సాధించడమే కాక.. అప్పుల భారాన్ని కూడా తీర్చేడయం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. 65 కేజీల మహిళల ఫ్రీ రెజ్లింగ్ విభాగంగా కౌర్ జపాన్ రెజ్లర్ మియా ఇమాయి‌పై 9-1 తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

Related Articles

Leave a reply