ప్రభుత్వానికి ప్రజలకు మహిళా సాధికార మిత్రలు వారధులని ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రభుత్వానికి ప్రజలకు మహిళా సాధికార మిత్రలు వారధులని ముఖ్యమంత్రి చంద్రబాబు

andhra pradesh2018-02-22 12:38:32
Share Tweet Google+ Instagram

ప్రభుత్వానికి ప్రజలకు మహిళా సాధికార మిత్రలు వారధులని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘‘మీరే నా బ్రహ్మాండమైన సైన్యం.. 4 లక్షల మంది సాధికారమిత్రలున్నారు. మీరో సంఘటిత శక్తిగా వచ్చే ఐదారు నెలలు కష్టపడాలి. ఒక్కొక్కరు 35 కుటుంబాలను బాగుపరచాలి.. మేమున్నామని వారికి భరోసా కలిగించండి.. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో సంతృప్తస్థాయిని వచ్చే నెలరోజుల్లో ఇంకా 6శాతం మేర పెంచండి’’ అని ఉద్బోధించారు. ప్రభుత్వ కార్యక్రమాలు అర్హులకు అందేలా చూడడం ప్రధానాంశంగా స్వయం సహాయ సంఘాల మహిళలను సాధికార మిత్రలుగా పెట్టారు. బుధవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద పలువురు మంత్రులతో కలిసి మహిళాసాధికార మిత్రలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. అక్కడ నుంచే వివిధ జిల్లాల్లోని సాధికారమిత్రలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రతి నెలా 21న ఇలాగే సమీక్షిస్తానని తెలిపారు.

‘‘ప్రభుత్వ పథకాలను పేదలకు చేర్చాలి. సంక్షేమ పథకాల కోసం పేదోడి నుంచి ఎవరైనా పైసా ఆశించినా ద్రోహమే. అలాంటివారి వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఆ డబ్బును సంబంధిత పేదలకు తిరిగి ఇప్పించడమే కాకుండా బాధ్యులపై కఠిన చర్యలూ తీసుకుంటాం. మీ పరిధిలోని 35 కుటుంబాల్లోని వారికి ఏ కష్టం ఉన్నా ఆసరాగా నిలవండి’’ అని పిలుపునిచ్చారు. ఆ 35 కుటుంబాల నుంచి మీకు అభినందనలు వస్తే అవి తనకు వచ్చినట్లేనని అన్నారు. ఉత్తమ సేవలందించిన మిత్రలను అమరావతికి ప్రభుత్వ అతిథులుగా ఆహ్వానించి, రాజధాని, పోలవరం, ఒకటిరెండు దేవాలయాలు, చర్చిలను చూపించి తిరిగి ఇంటివరకు తీసుకువెళ్లి దిగబెడతామన్నారు.

Related Articles

Leave a reply