శాంసంగ్ ఫోన్లపై అమెజాన్‌ బంపర్ ఆఫర్

శాంసంగ్ ఫోన్లపై అమెజాన్‌ బంపర్ ఆఫర్

technology2018-03-08 12:53:31
Share Tweet Google+ Instagram

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌తో భాగస్వామ్యం అయిన శాంసంగ్ పలు స్మార్ట్‌ఫోన్లపై రూ.8వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. అమెజాన్‌లో సోమవారం (మార్చి-5) ప్రారంభమైన శాంసంగ్ కార్నివాల్ ప్రత్యేక సేల్‌లో వినియోగదారులు శాంసంగ్ ఫోన్లను కొనవచ్చు. దీంతో వారికి రూ.8వేల వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

ఈ నెల 8వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగుతుంది. సేల్‌లో భాగంగా వినియోగదారులకు గెలాక్సీ నోట్ 8, గెలాక్సీ ఎ8 ప్లస్, ఆన్7 ప్రైమ్ (64 జీబీ), ఆన్7 ప్రైమ్ ఫోన్లపై వరుసగా రూ.8వేలు, రూ.4వేలు, రూ.2వేల క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

అయితే యూజర్లు అమెజాన్ పే వాలెట్‌లో నగదు జమ చేసి కొంటేనే ఈ క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది. దీంతో ఫోన్ డెలివరీ అయిన 10 రోజుల్లోగా క్యాష్‌బ్యాక్ క్రెడిట్ అవుతుంది. అలాగే ఈ ఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా వినియోగదారులకు లభిస్తున్నాయి. ఇక పేటీఎం మాల్‌లోనూ గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ ఫోన్లపై కస్టమర్లకు రూ.10వేల వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తున్నది. నోట్8పై రూ.8వేల క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నారు. ఈ ఆఫర్ కూడా ఈ నెల 8వ తేదీతో ముగియనుంది.

Related Articles

Leave a reply